ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటించిన మైత్రీ: ఏప్రిల్ 2026లో పవర్ స్టార్ రిపీట్ రికార్డ్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ — మళ్లీ ఒకసారి మాస్ పోలీస్ అవతారంలో రానున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు!🔥
హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పవన్ కెరీర్‌లోనే మరో హవాక్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతుందని టాక్.
అదే ఇప్పుడు మేకర్స్ నుండి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది!
మైత్రీ మూవీ మేకర్స్ తమ కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ —
“ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఏప్రిల్ 2026 లో సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం” అని అధికారికంగా అనౌన్స్ చేశారు.🔥
ఈ అప్‌డేట్‌తో పవర్ స్టార్ అభిమానుల్లో హైప్ మళ్లీ స్కై-హైగా వెళ్లిపోయింది.
పవన్ మరోసారి పవర్‌తో గర్జించే పోలీస్ ఆఫీసర్ రోల్… హరీష్ శంకర్ డైలాగులు… ఇది థియేటర్స్‌లో ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, సంగీతం మాత్రం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ది — అంటే పవర్ + రిథమ్ కలిపి పేలుడు గ్యారంటీ!💥🎶
2026 సమ్మర్‌కు పవర్ స్టార్ స్టార్మ్ ఖాయం! 🌪️🔥